హైదరాబాద్: 28°C
వార్తలు

పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తున్నారా..?

పిల్లలు ఎక్కువగా ఫోన్ వాడటం నేటి తల్లిదండ్రులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఫోన్ వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం, నిద్రలేమి, శారీరక శ్రమ లోపించడం వంటి తీవ్ర ప్రభావాలు పడుతున్నాయి. అందుకే పిల్లలకు రోజుకు నిర్ణీత సమయం మాత్రమే ఫోన్ ఇవ్వాలి. వారితో ఎక్కువ సమయం గడపాలి. ఆటల్లో ప్రోత్సహించాలి. నిద్రపోయే గంట ముందు ఫోన్ దూరం పెట్టాలి. వారి ముందు తల్లిదండ్రులు ఫోన్ వాడకం తగ్గించాలి.