హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి కొల్లు రవీంద్రతో పరిటాల శ్రీరామ్ భేటీ

ATP: అనంతపురం విచ్చేసిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ మహమ్మద్ అహ్మద్‌లను టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌లో బుధవారం ఈ భేటీ జరిగింది. తొలుత నాయకులకు పరిటాల శ్రీరామ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై వారు కాసేపు చర్చించారు.