హైదరాబాద్: 28°C
వార్తలు

గంజాయి రహిత గ్రామాలే లక్ష్యం: ఐజీ

ASR: డుంబ్రిగుడ మండలం కొత్తవలస గ్రామంలో ఇవాళ నిర్వహించిన 'పల్లెబాటలో ఈగల్' కార్యక్రమంలో రాష్ట్ర ఈగల్ వింగ్ ఐజీ ఆకే రవికృష్ణ పాల్గొన్నారు. గిరిజనులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. గంజాయి సాగు, రవాణాకు దూరంగా ఉండి ప్రత్యామ్నాయ ఆదాయ పంటలు సాగు చేయాలని సూచించారు. యువతకు ఉపాధి కల్పన అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.