హైదరాబాద్: 28°C
వార్తలు

నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్

NRML: నిర్మల్ అర్బన్ మండలం సోఫీనగర్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో సోమవారం అంతర్జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల వారందరికీ మాత్రలు అందించి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ సూచించారు.