హైదరాబాద్: 28°C
వార్తలు

సౌకర్యాలు అందించడంలో పాలకులు విఫలం

MNCL: చెన్నూర్ మున్సిపాలిటీ పలు వార్డుల్లో సీపీఎం (అంబేడ్కర్-మార్క్స్) జిల్లా కన్వీనర్ సంకె రవి సోమవారం పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కనీస సౌకర్యాలను ప్రజలకు అందించడంలో పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.