AP: ప్రకాశం జిల్లా తాళ్లూరు-ముండ్లమూరు మార్గంలో పసికందును ముళ్లకంపలో వదిలేశారు. పాలకేంద్రం సమీపంలోని రహదారి పక్కన ముళ్లకంపలో ఆడశిశువుగా గుర్తించారు. పసికందు ఏడుపు విని స్థానికులు అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. దీంతో 108 సిబ్బంది పాపను ఆస్పత్రికి తరలించారు. పాప క్షేమంగానే ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా, పాపకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
దారుణం.. ముళ్లకంపలో పసికందు


