కొత్త ఇల్లు నిర్మించుకునేటప్పుడు కొంతమంది ఏ నీరు అందుబాటులో ఉంటే దానిని వాడేస్తుంటారు. అయితే, అలా చేయడంతో గోడలు దెబ్బతిని ఇంటి మన్నిక అంత ఎక్కువకాలం ఉండదని ఇంజినీర్లు చెబుతున్నారు. నిర్మాణ సమయంలో ఉపయోగించే నీటికి పరీక్షలు చేయించాలంటున్నారు. నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉండే నీటిని మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. నీరు నాణ్యంగా ఉంటేనే భవనం భద్రంగా ఉంటుందని చెప్తున్నారు.
వార్తలు
ఇల్లు కడుతున్నారా.. ఏ నీరు వాడుతున్నారు?


