శివసేన UBT ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. అయోధ్య రామాలయానికి శివసేన అధినేత ఉద్ధవ్ ఇచ్చిన 4 కిలోల వెండి ఇటుక మాయమైందని ఆరోపించారు. వెండితో పాటు కోటి రూపాయల నగదు కూడా శివసైనికులు, సాధువల సమక్షంలో విరాళంగా ఇచ్చారని గుర్తు చేశారు. ఏళ్లు గడుస్తున్న రామాలయ ట్రస్ట్ నుంచి తమకు ఎలాంటి రసీదు అందలేదని తెలిపారు. విరాళాల అవకతవకలపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement


