హైదరాబాద్: 28°C
వార్తలు

తెలంగాణలో ఒంటరిగానే పోటీ: అమిత్ షా

తెలంగాణలో పొత్తులపై కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చెప్పారు. 'ఇకపై ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్నదే మా లక్ష్యం. TG, పంజాబ్‌లో అదే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాం' అని చెప్పారు. BJP పవర్‌లో ఉన్న రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని తెలిపారు.