ఫ్రాన్స్‌లో వచ్చే వారం జరిగే జీ-7 సదస్సులో ప్రధాని మోదీ, US అధ్యక్షుడు ట్రంప్ భేటీ కానున్నారు. గతేడాది మోదీ వాషింగ్టన్ పర్యటన తర్వాత తొలిసారి ఇరు నేతలు సమావేశంకానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే అంతర్జాతీయ సంస్థలు, కొత్త భాగస్వామ్యంపై, అన్ని రంగాల్లో స్థిరంగా ఆర్థిక వనరులను పెంచుకోవడం వంటి అంశాలపై ఇరు నేతలు మాట్లాడనున్నారు.
వార్తలు
జీ-7 వేదికగా మోదీ, ట్రంప్ భేటీ!


