తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కనీసం 3 నెలలైనా కొనసాగుతుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారని డీఎంకే అధినేత స్టాలిన్ ఎద్దేవా చేశారు. 'కొత్త ప్రభుత్వం వచ్చిన కారణంగా 6 నెలల వరకు విమర్శలకు దూరంగా ఉందామని అనుకున్నాం. కానీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ గడువు రాకముందే పరిణామాలు మారే విధంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం కనీసం 3 నెలలు కొనసాగగలదా? అని ప్రజలు అనుకుంటున్నారు' అని పేర్కొన్నారు.
వార్తలు
టీవీకే ప్రభుత్వం మూడు నెలలైనా ఉంటుందా?: స్టాలిన్


