హైదరాబాద్: 28°C
వార్తలు

తాగునీటి సంపును ప్రారంభించిన ఎంపీ

కృష్ణా జిల్లాలో త్రాగునీటి ప్రాజెక్టు మంజూరుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆదివారం నాగాయలంక మండలం పర్రచివర పంచాయతీ మూలపాలెంలో బీపీసీఎల్ సీఎస్ఆర్ నిధులు రూ.18.50లక్షలు, మరిన్ని నిధులు కలిపి రూ.29.50లక్షలతో నూతనంగా నిర్మించిన ఇరవై వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన ఓహెచ్ఎస్ఆర్, సంపును ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రారంభించారు.