AP: ఏలూరు జిల్లా కైకలూరు మండలం గోనెపాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ ఎన్నికల్లో భవానీపై 8 ఓట్ల మెజారిటీతో గెలిచిన మేక పద్మజకు అధికారులు ధ్రువపత్రం ఇచ్చారు. ఆ తర్వాత ప్రత్యర్థి రీకౌంటింగ్ కోరడంతో పద్మజ ఆగ్రహం వ్యక్తం చేశారు. రీకౌంటింగ్‌కు అంగీకరించేది లేదంటూ మద్దతుదారులతో కలిసి హైవేపై రెండు గంటలుగా బైఠాయించారు. దీంతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వార్తలు
గెలిచిన సర్పంచ్ హైవేపై బైఠాయింపు


