BDK: త్రిదండి చినజీయర్ స్వామి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కొనసాగుతున్న అభివృద్ధి, విస్తరణ పనులను పరిశీలించారు. ఆలయ ఇంజినీరింగ్ విభాగం ఈఈ వి.రవీంద్రనాథ్ మాస్టర్ ప్లాన్ ద్వారా ప్రతిపాదిత పనులను వివరించారు.
తెలంగాణ
భద్రాద్రిలో చినజీయర్ పనుల పరిశీలన


