హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

BHNG: మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం కుట్టు మిషన్లు పంపిణీ చేయడం అభినందనీయమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నాలుగు మండలాల మహిళలకు 194 కుట్టు మిషన్లు, తురక కుల వృత్తిదారులకు 40 జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు.