హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 2న VKBలో జిల్లా స్థాయి యువజనోత్సవం

VKB: కలెక్టర్ అనుమతితో డిసెంబర్ 2న VKBలోని అంబేద్కర్ భవన్‌లో జిల్లా స్థాయి యువజనోత్సవం నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి నర్సింహులు తెలిపారు. 30వ జాతీయ యువజనోత్సవం-2027లో పాల్గొనే ప్రతిభావంతులను ఎంపిక చేయడమే ముఖ్య ఉద్దేశం. ఈ ఉత్సవంలో జానపద నృత్యం, జానపద గానం, చిత్రలేఖనం, కవితా, వీధి నాటకం విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.