హైదరాబాద్: 28°C
తెలంగాణ

మన్సూరాబాద్ చెరువు వద్ద MDMA కలకలం.. ఒకరి అరెస్ట్

HYD: మన్సూరాబాద్ చెరువు కట్ట వద్ద ఎక్సైజ్ పోలీసుల తనిఖీల్లో 7.88 గ్రాముల MDMA పట్టుబడింది. సుమారు రూ.1.20 లక్షల విలువైన డ్రగ్స్‌తో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకుని మధు కుమార్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సరఫరాదారు మిర్యాల లెనిన్ పరారీలో ఉండటంతో గాలింపు చేపట్టారు. NDPS చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.