JGL: మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) కొడిమ్యాల మండల అధ్యక్షుడిగా జిల్లెల్ల వంశీ ఎన్నికయ్యారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బండారి నరేష్ అధ్యక్షతన ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ మాదిగ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్పందించి వారికి అండగా ఉంటానని తెలిపారు.
తెలంగాణ
ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షుడిగా జిల్లెల్ల వంశీ ఎన్నిక


