హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానవత్వం చాటుకున్న ఎస్సై

MLG: పస్రా SI తాజుద్దీన్ మానవత్వం చాటుకున్నారు. సోములగడ్డ క్రాస్‌రోడ్డు సమీపంలోని పీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి వచ్చిన ఓ వృద్ధురాలు నడవలేక ఇబ్బంది పడటాన్ని గమనించి చేయూతనిచ్చారు. ఆప్యాయంగా పలకరిస్తూ చేయి పట్టుకుని నడిపించారు. అనంతరం ఆటోను పిలిపించి సురక్షితంగా ఇంటికి పంపించారు. ఎస్సై చూపిన సేవాభావంపై పలువురు అభినందనలు తెలిపారు.