WGL: మైనార్టీ విద్యార్థుల కోసం సీఎం విదేశీ విద్య ఉపకార వేతన పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి టి.రమేష్ తెలిపారు. ఈ ఏడాది జులై 1 నుంచి డిసెంబరు 31 వరకు విదేశీ వర్సిటీల్లో పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారు అర్హులు. డిసెంబరు 1 నుంచి 31 వరకు తెలంగాణ ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సింది ఆయన సూచించారు.
తెలంగాణ
విదేశీ విద్య పథకానికి దరఖాస్తులు ఆహ్వానం


