హైదరాబాద్: 28°C
వార్తలు

అద్విక కేసు.. ఆస్తుల జప్తునకు అనుమతి

AP: విజయవాడలో అద్విక ట్రేడింగ్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏడుగురు ఏజెంట్ల ఆస్తుల జప్తునకు హోంశాఖ అనుమతి ఇచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపి అద్విక ట్రేడింగ్.. బాధితుల నుంచి రూ.413 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. బాధితులకు డబ్బు చెల్లించాలని ఏజెంట్లకు పోలీసులు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో.. ప్రభుత్వ అనుమతితో వారిపై చర్యలు తీసుకుంటున్నారు.