సింపుల్ పద్ధతులతో మొటిమలను నివారించొచ్చు

ఐస్‌తో మసాజ్ చేయడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి మెటిమలు ఉన్న చోట ఎరుపు తగ్గుతుంది.

మొటిమలు తగ్గించేందుకు రోజు తగినన్ని నీళ్లు తాగాలి. చర్మంలోని వాటర్, ఆయిల్‌ను సమతుల్యం చేయడం వల్ల సెబమ్ ఉత్పత్తి తగ్గి మొటిమలు తగ్గుతాయి.

యాపిల్ సిడార్ వెనిగర్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మంపై ఉన్న బ్యాక్టీరియాను తొలగించి స్కిన్ పీహెచ్ లెవల్స్ సమతుల్యం చేస్తాయి.

గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్లు, యాంటీ ఇంప్లమెంటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమల వల్ల ఏర్పడే మంట, వాపును తగ్గిస్తాయి. 

టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఇంప్లమేటరీ, యాంటీ బ్యాక్టిరీయల్ లక్షణాలు ఉంటాయి. నూనెలోని టెర్పెనిన్ యాంటిసెప్టిక్ వలే పనిచేసి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇన్‌ఫెక్షన్స్ తగ్గించి మొటిమలను నివారిస్తాయి.

ఆవిరి పట్టడం వల్ల చర్మం డీటాక్సిపై అవుతుంది. ఇది మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.

ఆలోవెరాను మొహనికి రాసుకుంటే మొటిమల వల్ల ఏర్పడే మంట, నొప్పి తగ్గుతాయి.

తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి.