మనం ఆరోగ్యకరంగా ఉండాలంటే అన్ని విటమిన్స్, మినరల్స్ కావాలి. అందులో జింక్ చాలా ముఖ్యం.

శరీరంలో రోగనిరోధక శక్తి పెంచెందుకు జింక్ ఉపయోగపడుతుంది. అది తగ్గితే జలుబు, దగ్గు అధికంగా వస్తుంది.

జింక్ తగ్గితే జుట్టు బలహీన పడుతుంది. జుట్టు రాలుతుంది.

చర్మం ఎర్రగా మారుతుంది. చర్మవ్యాధులు వస్తాయి. ఎగ్జిమా, చర్మం పొలుసులుగా మారుతుంది.

జింక్ లోపిస్తే డయేరియా వస్తుంది. చిన్నపిల్లలో ఎక్కువగా వస్తుంది.

జింక్ లోపిస్తే వాసన గ్రహించే తగ్గుతుంది. నాలుక, ముక్కు పనితీరులో తేడా ఉంటుంది.

జింక్ లోపిస్తే కంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రేచికటి వస్తుంది.

చేపలు, గుడ్లు తగిన మోతాదులో తీసుకుంటే జింక్ అందుతుంది.

చిక్కుడు గింజలు, నట్స్, డ్రైఫ్రూట్స్, బీన్స్ లో జింక్ అధికంగా ఉంటుంది.