ఉలవలు ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు శక్తిని అందిస్తాయి. 

ఎదిగే పిల్లలకు ఉలవలు తినిపిస్తే చాలా మంచిది. వారిని బలంగా ఉంచుతాయి.

ఉలవల్లో ఉండే పోషకాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి.

ఉలవలు తినడం ద్వారా ఎక్కిళ్లు రాకుండా నిరోధించవచ్చు

ఉలవల్లో ఉండే ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది.

ఫైబర్ కంటెంట్ పేగు కండరాల కదలికలను మెరుగుపరుస్తోంది. మలబద్దకం సమస్యను నివారిస్తోంది.

కప్పు ఉలవ చారుకు సమానంగా కొబ్బరినీళ్లు తీసుకుంటే మూత్రంలో వచ్చే మంట నుంచి ఉపశమనం పొందవచ్చును.

రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. 

జ్వరం, ఆయాసం, దగ్గు సమస్య ఉన్నవారు ఉలవ కషాయం తాగితే మంచిది.