వర్షం పడుతున్న సమయంలో దాల్చిన చెక్క, యాలకులు వేసిన టీ  తీసుకుంటే రిఫ్రెష్ అవ్వొచ్చు. గాలిలోని తేమతో వచ్చే గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తోంది.

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. 

కోల్‌కతా సిరప్‌తో పుదీనా, నిమ్మరసం, బ్లాక్ సాల్ట్‌ని కలిపి పానీయం చేయాలి. ఇది తీసుకుంటే ఒత్తిడిని తగ్గించి, హుషారును పెంచుతుంది.

పుదీనా, తేనె, నిమ్మరసంతో గ్రీన్ టీ చేసుకొని వర్షం పడే సమయంలో తీసుకుంటే బాగుంటుంది.

వేడి చేసిన పాలలో కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ వేసి తీసుకుంటారు. ఇది కశ్మీర్‌లో ఫేమస్.

తులసి కాఫీ యాంటీ బ్యాక్టిరియల్, యాంటి ఇన్‌ఫ్లమెటరీగా పనిచేస్తోంది.

అల్లాన్ని వేడి నీళ్లలో మరిగించి అందులో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే సాయంత్రం వేళ హాయిగా ఉంటుంది.

లెమన్ గ్రాస్‌తో చేసిన టీ తాగితే శరీరం, మనసు తేలికగా, రిఫ్రెష్‌గా ఉంటుంది. కొంచెం చేదుగా, తీయగా, పుల్లగా ఉండే టీ తాగితే రిలాక్స్‌గా ఉంటుంది. 

పాలల్లో చిటికెడు పసుపు పంచదార వేసుకొని వేడి చేసి తాగొచ్చు. వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే గొంతు నొప్పి జలుబు తగ్గిస్తోంది.

గ్లాస్ పాలల్లో కొద్దీగా శొంఠి పొడి, మిరియాల పొడి వేసి కాచి తాగాలి. వేడిగా ఉన్నప్పుడు తాగితే రుచిని ఆస్వాదించొచ్చు. యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది.