త్రికోణాసనం ప్రతి రోజు చేయడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు తొలిగిపోతాయి. జీర్ణక్రియ మెరగవుతోంది.

వెన్ను నొప్పి ఉన్నవారికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. తద్వారా వెన్నెముక బలంగా మారుతోంది.

మెడనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మెడ కండరాలు కూడా బలపడుతాయి.

నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో ఈ ఆసనం ఉపయోగపడుతుంది.

ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో త్రికోణాసనం సాయపడుతుంది. ప్రతి రోజు చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.

రక్త హీనత, రక్తపోటు సమస్యలు ఉన్నవాళ్లు ఈ ఆసనం చేయడం చాలా ఉపపయోగకరం. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లో ఉంటుంది.

త్రికోణాసనం వలన గుండెకు రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.

రోజు చేయడం వల్ల కండరాలు స్ట్రెచ్ అయి బాడీ మొత్తం ఫ్లెక్సిబిలిటీగా మారుతుంది.

వర్టిగో, తల తిరగడం ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు. మెడనొప్పి తీవ్రంగా ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.