చలికాలం చాలా మందికి చర్మం, పెదాలు పగిలిపోతాయి. అందుకోసం చాలా మంది రకరకాల క్రీములు వాడుతుంటారు. అలా కాకుండా మన ఇంటిలో దొరికే వాటితో మన పెదాలు రక్షించే మార్గాలను ఇక్కడ చూద్దాం.

కొబ్బరి నూనెలో కాస్త నారింజ నూనెను కలిపి పెదాలపై రాసుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పగుళ్లు కూడా నయం అవుతాయి.

పూదీనా నూనెలో షియా బటర్ కలిపి రాసుకుంటే పేదాలు ఆరిపోకుంటా ఉంటాయి. ట్యాన్‌ను తొలగించి ఎర్రగా కనిపిస్తాయి.

బీట్ రూట్‌ను ఉడికించి జూస్ చేసుకోవాలి. దానిలో షియా బటర్ కలిపి రోజు పెదాలకు రాసుకుంటే అందంగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి.

తేనె పెదాలను అందంగా ఉంచడంలో సాయపడుతుంది. తాజాగా, తేమగా ఉండాలంటే తేనె చక్కటి చిట్కా. పగుళ్లు కూడా తొలగిపోతాయి.

నెయ్యిలో బాదం నూనెను కలిపి రాసుకుంటే పెదాలకు కావాల్సిన తేమ లభిస్తుంది. పగుళ్లు కూడా మాయం అవుతాయి. పెదాలు మెరిసేలా చేస్తుంది.

జోజోబ అయిల్, కొబ్బరి నూనె మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేయాలి. ఈ జెల్ లాంటి పదార్థాన్ని పెదాలకు రాసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

షియా బటర్, కోకో బటర్ రెండింటి ఒక మిశ్రమంగా కలపాలి. దాన్ని పెదాలకు రాసుకుంటే ఎప్పుడూ తాజాగా ఉంటాయి.

చాక్లెట్ పౌడర్‌లో షియా బటర్ కలిపి లిప్‌బామ్‌ను తయారు చేసుకోవచ్చు. దీన్ని పెదాలకు రాసుకుంటే ఆకర్షణీయంగా మారుతాయి. పగుళ్లు కూడా పోతాయి.