పెదవులు మృదువుగా ఉండాలంటే లిప్ స్క్రబ్ వాడాలి. వారానికి ఒకసారి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఇంటినుంచి బయటకు వెళ్లే సమయంలో లిప్ బామ్ తప్పకుండా వాడాలి.

లిప్ బామ్ వాడటంతో పెదవులు పొడిబారే తత్వం తగ్గుతాయి.

రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తీసుకోవాలి. దీంతో పెదవులతోపాటు చర్మం హైడ్రేట్ కాకుండా ఉంటుంది.

పెదవులను కొరకవద్దు, అలాగే చప్పరించవద్దు. అలా చేస్తే నోటిలోని సలైవాలో ఉన్న ఎంజైమ్స్ వల్ల పెదవులు పాడవుతాయి.

పెదవులు మృదువుగా ఉండాలంటే రాత్రి పూట లిప్ మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలి.

పెదవులు నల్లగా మారితే నిమ్మరసం, గ్లిజరిన్ ఉపయోగించండి

స్నానం చేసే ముందు పెదవులపై మీగడ రాసుకుంటే అవీ మెరుస్తూ ఉంటాయి.