గుండె సంబంధిత రోగాలకు ముఖ్య కారణం ఒత్తిడి. దీన్ని అధిగమించాలంటే ప్రతి రోజు వీటిని చేయాలి.
ప్రతి రోజు 30 నిమిషాలు మీకు నచ్చిన పాటలు వినండి. మ్యాజిక్ బీపీని కంట్రోల్ చేస్తుంది. తద్వారా గుండెకు ముప్పు తప్పుతుంది.
మనసుకు ఇష్టమైన వారిని ప్రేమగా హగ్ చేసుకోవాలి. వార్మ్ హగ్ అనేది గుండెకు మేలు చేస్తుంది. దీని ద్వారా కార్టిసాల్ స్థాయి తగ్గుతుంది. దీంతో ఒత్తిడి మాయం అవుతుంది.
మనం తినే ఆహారంలో ఒమెగా 3 ఉండేలా చూసుకోవాలి. ఇది ఎక్కువగా ఫిష్, వాల్‌నట్స్, అవకాడోలో లభిస్తుంది. దీనిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
సంతోషంగా, పాజిటీవ్‌గా ఉండాలి. ఇతరులకు సాయం చేయాలి. అలా చేయడం వలన ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇది రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.
ఎక్కువగా పండ్లు తినడం వలన గుండె పదిలంగా ఉంటుంది. వీటిలో తక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఎక్కువ పోషకాలు ఉంటాయి.
పనిలో భాగంగా రోజంతా బిజీగా గడపకుండా కాస్తా విరామం తీసుకోండి. దాని ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. దానితో గుండె భద్రంగా ఉంటుంది.
ఇతురల పట్ల కరుణ, దయ చూపడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దాంతో బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. గుండె సంబంధిత రోగాలు దరికిరావు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. కార్డియో చేయడం వలన గుండెకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది.