వర్షాకాలంలో మహారాష్ట్రలో చూడాల్సిన ప్రదేశం ఇకత్ పురి. పచ్చని లోయలు, ఘాట్ రోడ్ గుండా ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంది.
వర్షం కురిసే సమయంలో ట్రావెల్ చేసే వారు కచ్చితంగా మహాబలేశ్వర్ వెళ్లాలి. పచ్చని ప్రకృతి మధ్య ఉన్న తోటలు, దట్టమైన అడవులు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.
పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వతశ్రేణిలో అంబోలి ఉంది. ఇక్కడికి వెళితే తప్పకుండా సరికొత్త అనుభూతిని పొందుతారు.
కర్ణాటకలో అడవులు, కొండలు, జలపాతాల మధ్య అగుంబే ఉంటుంది. ఈ హిల్ స్టేషన్ తప్పకుండా పర్యాటకులకు నచ్చుతుంది.
అన్నామల్లై కొండలో వల్పరాయ్ ఉంది. వానాకాలంలో పచ్చని కొండలు ప్రశాంతతను ఇస్తాయి.
గోవాకు దగ్గరలో గల టూరిస్ట్ ప్లేస్ మొల్లెం. వర్షకాలంలో నీటి ప్రవాహం పెరగడంతో ఇక్కడి జలపాతాలు ముచ్చటగా ఉంటాయి.
రెయినీ సీజన్‌లో కర్ణాటకలో గల మడికేరి మంచి అనుభూతి కలిగిస్తోంది.
కర్ణాటకలో ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ దండేలి. దట్టమైన అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, జలపాతాలు టూరిస్టులను ఆకట్టుకుంటాయి.