శ్రద్ధా దాస్ భారతీయ సినీ నటి.

పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది.

ముంబైలో జన్మించింది. తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి.

తల్లిదండ్రులు పురూలియా నుండి వచ్చి ముంబైలో స్థిరపడ్డారు.

ముంబైలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది.

ముంబై విశ్వవిద్యాలయము నుండి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది.

2008లో సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత హిందీ, కన్నడ, మలయాళం, బెంగాళీ సినిమాల్లో నటించింది.

ప్యూర్ సౌల్ అనే ఇంగ్లీష్ చిత్రంలో కూడా కనిపించింది.

వెంకటేష్, ప్రభాస్, రాజశేఖర్, అల్లు అర్జున్, బాలకృష్ణ వంటి తారలతో నటించింది.