శ్రియా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ సినిమా నటి.
సెప్టెంబరు 11, 1982లో జన్మించింది.
2001లో తెలుగు సినిమా ఇష్టంతో ఎంట్రీ ఇచ్చింది.
2002లో వచ్చిన నువ్వే నువ్వే మంచి కమర్షియల్ హిట్.
2007లో శివాజీలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశం వచ్చింది.
ది అదర్ ఎండ్ అఫ్ ది లైన్ అనే ఇంగ్లీష్ సినిమాలోను నటించింది.
శివాజీ సినిమాలో నటనకు గాను సౌత్ స్కోప్ స్టైల్ అవార్డు... బెస్ట్ తమిళ్ యాక్ట్రెస్ అవార్డు దక్కించుకున్నది.
వివిధ భాషల్లో బెస్ట్ నటిగా అవార్డులు దక్కించుకున్నది.
మనం, గోపాల గోపాల, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల్లో నటనకు కూడా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు పొందింది.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తదితర టాప్ హీరోలతో నటించింది.