తమన్నా తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించింది.
తమన్నా నటి, మోడల్, డ్యాన్సర్.
2005లో చాంద్ సా రోషన్ చెహ్రా సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది.
అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో నటించింది.
2006లో కేడీతో తమిళంలోకి అడుగు పెట్టింది.
ఈ మూడూ ఫెయిలయ్యాయి.
2007లో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్ సూపర్ హిట్.
అదే సమయంలో వచ్చిన తమిళ సినిమా కళ్ళూరి గుర్తింపునిచ్చాయి.
ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు తమన్న.
తమన్నా 1989 డిసెంబరు 21న ముంబైలో జన్మించింది.
తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో 13వ ఏట సినీ రంగ ప్రవేశం చేసింది.