బత్తాయి పండ్లలో చాలా పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఎ, ఫాస్పరస్, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

జలుబుతో బాధపడేవారికి బత్తాయి రసం చాలా బాగా పనిచేస్తుంది. వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.

మలబద్ధకం సమస్య ఉన్నవారు బత్తాయి రసంలో చిటికెడు ఉప్పు వేసి తాగితే చాలా మంచిది.

బత్తాయి రసంలో అల్లం, జీలకర్ర పొడి వేసుకుని తాగితే దగ్గు తగ్గుతుంది. ఆస్తమా ఉన్నవాళ్లకు ఇది మంచి ఉపశమనం.

కిడ్నీలలో వచ్చే ఇన్పెక్షన్లను తగ్గించేందుకు బత్తాయిల్లో పొటాషియం చాలా బాగా ఉపయోగపడుతుంది.

బత్తాయి రసంలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపును కూడా తగ్గిస్తుంది.

విరేచనాల వలన కలిగే అలసట, నీరసం పోవాలి అంటే బత్తాయి రసం చాలా మంచింది. దీనిలో ఉండే పోషకాలు తక్షణ శక్తిని ఇస్తుంది.

రక్తహీనతతో బాధపడేవారు బత్తాయి రసం తాగడం మంచిది. దీనిలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. దాని వలన రక్తం అధికంగా వృద్ధి చెందుతుంది.

గర్భిణిల్లో శిశువు పెరుగుదలకు బత్తాయి రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.