మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు చాలా ముఖ్యం. సమృద్ధిగా నీరు తీసుకుంటే బాడీ హైడ్రాడ్‌గా ఉంటుంది. అవయవాలు కూడా మంచిగా పనిచేస్తాయి. అయితే నీటిని తాగేందుకు సరైన సమయాలు కూడా ఉన్నాయి. అవెంటో చూద్దాం.

ఉదయం నిద్ర లేవగానే గ్లాసు నీళ్లు తాగాలి. రాత్రంత పడుకోవడం వలన బాడీ డీహైడ్రెడ్ అవుతుంది. లేవగానే గ్లాసు నీళ్లు తాగితే జీవక్రియ మెరుగుపడుతుంది.

భోజనం చేయడానికి అరగంట ముందు గ్లాసు వాటర్ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు అదుపులో ఉంటుంది.

వ్యాయామం చేసే ముందు గ్లాసు వాటర్ తాగితే బాడీ హైడ్రెడ్ అవకుండా ఉంటుంది. ఎక్సర్‌సైజ్ మధ్యలో కూడా గ్లాసు వాటర్ తాగడం మంచిది.

ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ఒక గ్లాసు వాటర్ తాగాలి. భోజనం చేసిన గంట తరువాత మరో గ్లాస్ వాటర్ తాగడం మంచిది. అలా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

బద్దకంగా ఉన్నప్పుడు, అలసటగా ఉన్నప్పుడు ఒక గ్లాసు వాటర్ తాగడం మంచిది. బాడీ హైడ్రెడ్ అవకుండా ఉంటుంది.

ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. 2 నుంచి 3 లీటర్ల వాటర్ తాగాలి. అలా చేస్తే బాడీకి తగినన్ని లవణాలు అందుతాయి. అలిసిపోకుండా ఉంటాము.

నిద్రించే ముందు ఒక గ్లాసు వాటర్ తాగడం మంచిది. పడుకున్న సమయంలో బాడికి కావాల్సిన నీరు అందుతుంది.