కాజల్ అగర్వాల్ భారతీయ సినిమా నటి.
తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో ఆరంగేట్రం చేసింది.
2007లో వచ్చిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ పక్కన నటించింది.
2009లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీరలో నటించింది.
రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది.
అదే ఏడాది హీరో రామ్ గణేష్, అల్లు అర్జున్ ఆర్య-2లో నటించింది.
2010లో డార్లింగ్ లో తన నటనతో మెప్పించింది. ప్రభాస్ పక్కన నటించింది.
ఆ తర్వాత జూ.ఎన్టీఆర్ బృందావనంలో సమంతతో కలిసి నటించింది.
ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ తో మరిన్ని మార్కులు సంపాదించుకున్నది.
2010లో నాపేరు శివతో తమిళ సినీ రంగ ప్రవేశం చేసింది.
ఎక్కువగా తెలుగు, ఆ తర్వాత తమిళ సినిమాల్లో నటించింది.