అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. తక్షణం ఎనర్జీకోసం క్రీడాకారులు ఎంతో ఇష్టంగా తింటారు. వాటి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
అరటి పండ్లకు సాంద్రత చాలా తక్కువ. అందుకే ఇవి నీటిలో వేస్తే తేలుతాయి.
వృక్షశాస్త్రి నిపుణులు ప్రకారం అరటి పండ్లు బెర్రి జాతికి చెందినవి.
మనుషుల డీఎన్ఏ అరటి పండ్ల డీఎన్ఏకు పోలిక ఉంది. ఈ రెండింటిలో 50 శాతం పోలిక ఉందట.
అరటిపండ్లను పండించే దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో కొనసాగుతుంది.
అరటి పండ్లను హ్యాండ్ అంటారు. ఇవన్ని ఒక కాండానికి కలిసి ఉంటాయి.
అరటి పండ్ల మీద వచ్చిన పాటలు ఇంకే పండుమీద రాలేదు.
అరటి పండ్లు మొత్తం 300 రకాలు. అందులో 12 నుంచి 15 రకాలు భారతదేశంలో పండుతాయి.
అరటి పండులో అనేక పోషకాలు ఉంటాయి. కాల్షియం, ఐరన్, సోడియం, మాంగనీస్, జింక్, క్రోమియం, కెరోటిన్, రైబోప్లేవిన్, విటమిన్ సీ, బీ2 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.