బార్సిలోనలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో హనర్ మ్యాజిక్ 5 సీరిస్ మొబైల్స్ లాంఛ్

హనర్ మ్యాజిక్ 5, హనర్ మ్యాజిక్ 5 ప్రో మొబైల్స్, చైనా బయట ఫోల్డబుల్‌ మోడల్‌లో వస్తోన్న హనర్ మ్యాజిక్ Vs

స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్వీసీ‌తో వస్తోన్న మొబైల్స్

హనర్ మ్యాజిక్ 5 మొబైల్ స్టార్టింగ్ ప్రైస్ రూ.78,800, 12 జీబీ ర్యామ్, 512 స్టోరెజ్ గల హనర్ మ్యాజిక్ ప్రో రూ.1,05,100. హనర్ మ్యాజిక్ వీఎస్ రూ.1,40,300 

బ్లాక్, గ్లేసియర్ బ్లూ, మిడో గ్రీన్, ఆరెంజ్, కొరల్ పర్పుల్‌‌ కలర్‌లో వస్తోన్న మొబైల్

6.81 ఓఎల్‌ఈడీ డిస్ ప్లేతో హనర్ మ్యాజిక్ ప్రో వస్తుండగా.. 6.73 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ ప్లేతో మ్యాజిక్ 5 ఫోన్ వస్తుంది.

మ్యాజిక్ ప్రోలో వెనకాల మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ముందు 12 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. అదే మ్యాజిక్ 5 విషయానికి వస్తే 54 మెగా పిక్సెల్ వైడ్ మెయిన్ కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 32 మెగా పిక్సెల్ టెలీఫోటో లెన్స్ కెమెరా ఉంది. దీనిలో కూడా 12 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు చేశారు.

మ్యాజిక్ ప్రోలో 5100 ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. ఇదీ 66 వాట్ సూపర్ చార్జీ అవుతుంది. సిమ్ కార్డు 5జీ, వైఫై, బ్లూటూత్ సపోర్ట్ చేస్తోంది. మ్యాజిక్ 5 ప్రో మాదిరి మ్యాజిక్ 5లో అన్నీ ఫీచర్స్ సేమ్‌గా ఉంటాయి.