తులసిలో అనేక దివ్యౌషధాలు ఉన్నాయి అని హిందు ధర్మం బలంగా విశ్వసిస్తుంది. వీటిని ఏదో రకంగా రోజు తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతారు.
తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ నివారణకు పనిచేస్తాయి. అనేక రకాల క్యాన్సర్ కారకాలను ఇవి నివారిస్తాయి.
తులసి ఆకుల్లో యాంటీ డయాబెటీస్ గుణాలు ఉన్నాయి. ఇవి రోజు తీసుకోవడం వలన రక్తంలో చక్కర శాతం తగ్గుతుంది.
తులసిలో ఉండే యూజినాల్ అనే సమ్మెలనం గుండె పోటు రాకుండా నివారిస్తుంది. రోజు ఐదు నుంచి ఆరు ఆకులు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
తులసిలో యాంటి బాక్టీరియల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. అందువల్ల ఊపిరితిత్తులను క్లీన్ చేయడంలో తులసి ఉపయోగపడుతుంది.
తులసిలో ఉండే యాంటి మైక్రోబియాల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మవ్యాధుల నుంచి కాపాడుతాయి.
తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం కిడ్నీలకు మంచిది. రాళ్లు తదితర వ్యాధులు దరిచేరనీయదు.
తులసిని క్రమం తప్పకుండా నమలడం వలన గ్యాస్టిక్, జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.