పసుపులో ఉండే కర్కుమిన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. చర్మకణాల డ్యామేజ్‌ను తగ్గించి వృద్దాప్య ఛాయలను నివారిస్తాయి.

గ్రీన్ టీలో ఉండే ఎపిగాలో కెటాచిన్ గాలెట్ వల్ల చర్మం ముడతలను నివారిస్తోంది.

బెర్రీ పండ్లలో కొల్లాజెన్ ఉంటుంది. చర్మ నిర్మాణం కాపాడటంలో కొల్లాజెన్ కీ రోల్ పోషిస్తోంది. చర్మం ముడతలను కొల్లాజెన్ తగ్గిస్తోంది.

అరటిపండ్లలో ఎక్కువగా నికోటినమైడ్ ఉంటుంది. స్కిన్ ఇంప్లిమెంటేషన్ తగ్గించడంతోపాటు చర్మ సౌందర్యం కాపాడుతుంది.

సోయా గింజల్లో ఉండే కోఎంజైమ్ 10 ఒత్తిడిని తగ్గించి వృద్ధాప్య ఛాయలను నివారిస్తోంది. 

కుంకుమ పువ్వలో ఉండే కెరోటినాయిడ్ పిగ్మెంట్ క్రోసిన్ డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది. చర్మం ముడతలు, అనారోగ్య సమస్యలను నివారిస్తోంది.

చర్మ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సీ. వృద్ధాప్య ఛాయలను నివారిస్తోంది. 

పాలీపినాల్ యాంటీ ఆక్సిడెంట్ రస్వరట్రోల్ ఎక్కువగా ద్రాక్ష, బెర్రీ, వేరుశనగల్లో ఉంటుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సాయపడుతుంది.

బాదంలో చర్మ సౌందర్యం రెట్టింపు చేసే విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది.