శీతాకాలంలో వాతావరణం ఎక్కవ తడిగా ఉండడం వలన చుండ్రు పెరుగుతుంది. కొన్ని నూనెలు వాడడం వలన దీన్ని అరికట్టవచ్చు. అవేంటో చూద్దాం.
కొబ్బరి నూనె వాడడం చాలా మంచిది. దీనిలో ఉండే పోషకాలు కుదుళ్లను గట్టిగా ఉంచడంతో పాటు మాడను తేమగా ఉంచి చుండ్రును నివారిస్తుంది.
యాంటి బాక్టిరియా, యాంటి ఫంగల్ లక్షణాలకు టీ ట్రీ అయిల్ మంచి ఔషదం లాంటిది. చుండ్రును తగ్గించి కుదుళ్లలో చికాగును తగ్గిస్తుంది.
జొజోబా అయిల్ కుదుళ్లను తేమగ ఉంచడంలో సాయపడుతుంది. చుండ్రును నివారిస్తుంది. వెంట్రుకలు దృఢంగా ఉంటాయి.
రోజ్ మేరీ అయిల్ జుట్టును దృఢంగా ఉంచుతుంది. స్కాల్ప్‌లో సహజ తేమ ఉత్పత్తికి తోడ్పడుతుంది. చుండ్రు తగ్గిపోతుంది.
వేప నూనెలో యాంటి బాక్టిరియా, యాంటి ఫంగల్ లక్షణాల పుష్కలంగా ఉండడంల వలన జుట్టును కాపాడడంతో పాటు చండ్రును నిర్మూలిస్తుంది.
పూదినా ఆరోగ్యానికి ఎంత మంచిదో దీని నూనె కూడా కుదుళ్లకు అంత మంచిది. ఇందులో ఉండే యాంటి ఇంప్లమేటరీలు చండ్రును దరిచేరనీయవు.
ఆర్గానిక్ అయిల్‌లో యాంటి యాక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చుండ్రును నివారించి కుదుళ్లకు బలం చేకూరుస్తాయి.
ఆముదం నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ డ్యాాండ్రాఫ్‌ను నివారిస్తాయి. జుట్టుకు తగిన తేమను అందిస్తాయి.