రాత్రిళ్లు నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది రాత్రి పడుకునే సమయంలో మొబైల్ చూడటం.

నిద్ర రావడానికి 2 గంటల ముందు మెలటోనిస్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల నిద్రరాదు.

స్నేహితులతో చిట్ చాట్ చేయడం కూడా ఓ కారణంగా వైద్యులు చెబుతున్నారు.

వయస్సు పెరగడం వల్ల కూడా నిద్ర రాదు. నొప్పులు, హెల్త్ ఇష్యూస్ వల్ల నిద్ర త్వరగా రాదంటున్నారు.

నిద్ర పోవడానికి ముందు కెఫిన్ ఎక్కువగా ఉన్న టీ, కాఫీ తీసుకోవద్దు. దీంతో నిద్ర త్వరగా రాదు

మానసిక సమస్యలు నిద్రపై ప్రభావం చూపుతాయి. ఒత్తిడి వల్ల నిద్రలేమి వస్తోంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే యోగా, ధ్యానం చేయాలి.

నిద్రపోవడానికి ముందు ప్రొటిన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న నిద్ర రాదు. ఆ ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. 

షిప్టులలో పనిచేయడం వల్ల కూడా నిద్ర సరిగా రాదట. ఒకే షిప్ట్ చేస్తే ఏ ప్రాబ్లమ్ ఉండటని వైద్యులు చెబుతున్నారు. 

బెడ్ రూమ్‌లో శబ్దాలు, వెలుతురు ఎక్కువగా వస్తే ఇబ్బందే.. ఈ రెండు సమస్యలు లేకుండా చూసుకోవాలి.