అషు రెడ్డి భారతీయ చలనచిత్ర నటి

తెలుగు సినిమా పరిశ్రమలో పని చేశారు.

2018లో చల్ మోహన్ రంగాలో నటించింది.

బిగ్ బాస్ 3లో మూడో కంటెస్టెంటుగా సోషల్ మీడియా సెలబ్రిటీ అషురెడ్డి ఎంటయ్యారు.

అషు రెడ్డి విశాఖపట్నంలో పుట్టి పెరిగారు. అమెరికాలోని టెక్సాస్‌లో స్థిరపడ్డారు. తల్లిదండ్రులు, అక్కతో అషు రెడ్డి అక్కడే ఉంటున్నారు.

అమెరికాలో గ్రాడ్యుయేషన్ తర్వాత మాస్టర్స్ మధ్య వచ్చిన ఖాళీ సమయంలో సరదాగా డబ్ స్మాష్ వీడియో ఒకటి చేసి సోషల్ మీడియాలో పెట్టారు.

ఏమాయ చేసావె సినిమాలో సమంత డైలాగులతో ఈ వీడియో చేశారు.

తొలి వీడియోతో అషు రెడ్డి పాపులర్ అయ్యారు. జూనియర్ సమంత అంటూ కొనియాడారు.

డబ్‌స్మాష్ వీడియోలు ఆమెను సోషల్ మీడియా స్టార్‌ను చేశాయి.

అషు రెడ్డికి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం.