తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు, ఆకుకూరలు, నట్స్, ప్రోటీన్ ఉండాలి
శరీరానికి సరిపడ నీరు తీసుకోవాలి. అలా తీసుకుంటేనే స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ చక్కగా పనిచేస్తుంది.
అల్ట్రా వయొలెట్ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్ స్క్రీన్ వాడాలి.
శరీరం నుంచి చెమట రావాలి. అప్పుడే రక్త సరఫరా బాగుంటుంది. ఎనర్జీ పెరిగి.. ఫిట్‌నెస్‌తో ఉంటారు.
టెన్షన్ తగ్గేందుకు ధ్యానం, యోగా చేయండి
కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. ఒంట్లో కొవ్వు కరిగిపోతుంది. నిద్ర తగ్గితే బరువు ఆటోమెటిక్‌గా పెరుగుతారు.
సిగరెట్, డ్రింక్ అలవాటు ఉండే మానేయాలి. స్మోక్ చేయడం వల్ల త్వరగా ముసలితనం వస్తోంది. లిక్కర్ చర్మంపై ప్రభావం ఉంటుంది.
పజిల్స్ చేయండి, మ్యూజిక్ పరికరాలను వాయించండి. ఇవీ మీ మెదడును చురుగ్గా ఉంచుతాయి.
మీ కుటుంబంలో ఎవరికైనా బీపీ, షుగర్ ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి.
నలుగురిలో ఉండండి. మనసు విప్పి మాట్లాడండి. దీంతో మానసిక ఆందోళన తగ్గుతుంది.