వేడినీటితో అవిరిపట్టడం వలన చర్మం క్లీన్‌గా ఉంటుంది. స్వేద రంద్రాలు ఓపెన్ అవుతాయి. దీని వలన మలినాలు తొలగిపోతాయి. 

కాస్త గోరు వెచ్చటి నీటితో బ్లాక్ హెడ్స్ పోతాయి. తద్వారా ముఖం అందంగా మారుతుంది.

వేడి నీటితో ఆవిరి పడితే బ్యాక్టిరియా దరికి చేరదు. తద్వారా ముఖంపై మొటిమలు కూడా రావు.

గోరువెచ్చటి నీటితో ముఖం వాష్ చేసుకుంటే రక్త ప్రసరణ చాలా మంచిగా జరుగుతుంది.

వేడినీటితో ఆవిరి పట్టుకుంటే జిడ్డు మాయం అవుతుంది.

ముఖానికి ఆవిరిపట్టడం వలన కొల్లాజన్, ఎలస్టిన్ ఉత్పత్తి అవుతుంది. దాని వలన చర్మం బిగిసి నిత్య యవ్వనంగా మారుతుంది.

మరి దగ్గరగా ఆవిరి పడితే చర్మం తన సహజగుణాన్ని కోల్పోతుంది. కాబట్టి దూరంగా ముఖాన్ని పెట్టి ఆవిరి పెట్టాలి. 

ఎక్కువ సమయం అవిరి పట్టకూడదు. అలా చేస్తే చర్మం పోడిగా మారే ప్రమాదం ఉంది.