బాధను తగ్గించే చిట్కాలు!

రోజులో కొంత సేపు వర్రీ టైమ్‌ను కేటాయించుకుని.. ఆ సమయంలోనే బాధపడి తర్వాత పనిపై దృష్టి పెట్టాలి.

అసలు ఎందుకు బాధపడుతున్నారో గల కారణాలను ఒక పేపర్‌పై రాయాలి. దానివల్ల సమస్య పరిష్కారం దొరుకుతుంది.

ఎప్పుడూ నెగిటివ్‌గా థింక్ చేయకుండా పాజిటివ్‌గా ఆలోచించడానికి కూడా సమయం కేటాయించండి.

మీరు అనుకున్నవి కాలేదని బాధపడకుండా.. విజయం సాధించారని ఊహించుకుని సంతోషంగా ఉంటే బెటర్.

ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం చేస్తుండాలి.

ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ బిజీగా ఉంటే బాధపడే ఆలోచనలు రావు.

కొన్ని పట్టించుకోకుండా వదిలేయడం మంచిది.

మీకు బాధ కలిగించేలాంటి న్యూస్ కూడా ఎక్కువగా చూడవద్దు.

అన్నింటికంటే ముఖ్యం మీరు ఎందుకు బాధపడుతున్నారు, పరిష్కారం ఏంటో వెతుక్కోవాలి.