హైదరాబాద్: 28°C
తెలంగాణ

కన్నీటి మధ్య అవయవదానం

NLG: దేవరకొండకు చెందిన నితీష్ (25) హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. శనివారం సాయంత్రం మృతదేహాన్ని స్వగృహానికి తీసుకొచ్చారు. పదేళ్ల క్రితం తండ్రిని కోల్పోయిన నితీష్‌ను తల్లి హేమలత కష్టపడి చదివించి ఇంజినీర్ చేసింది. కుమారుడి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు మానవత్వంతో నల్గొండ ఐ బ్యాంకుకు అతడి కళ్లను దానం చేశారు.