E.G: రోడ్డు ప్రమాదంలో గాయపడి వైద్యం కోసం దాతల సాయం కోరిన పట్టణానికి చెందిన చింత కిరణ్ కుమార్, నీలిమ దంపతులకు అమ్మ ఫౌండేషన్ అండగా నిలబడింది. బాధితుడు కిరణ్‌ను ఆదుకోవాలని కోరగా… అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇమ్మిడిశెట్టి నాగభూషణం కూడా స్పందించి, సంస్థ ద్వారా విరాళాల సేకరణ చేశారు. రూ.35 వేల నగదును ఆదివారం అందజేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలన్నారు.