క్యారెట్ హల్వాలో ఎన్నో పోషకాలు ఉంటాయి. శీతాకాలంలో తినడం వలన శరీరం వెచ్చగా ఉంటుంది. పాలు, చక్కెర, డ్రై ఫ్రూట్స్ ఉండటం వలన రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
పంజాబీ స్వీట్ అయిన పిన్ని తినడం ఆరోగ్యానికి చాలా మంచింది. వింటర్ సీజన్లో ఇది తినడం వలన బాడీ వెడెక్కుతుంది. గోధుమపిండి, బెల్లం, నువ్వులు ఇతర చిరుదాన్యాలు కలిపి వీటిని తయారు చేస్తారు.
పల్లీ పట్టిని చిన్నపిల్ల నుంచి పెద్దవాల్ల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. బెల్లం, వేరుశనగలు శరీరాన్ని తగిన వేడిని అందిస్తాయి. కేవలం పల్లీలతోటే కాకుండా జీడిపప్పు, పిస్తా, కాజుల చిక్కీలు కూడా దొరుకుతాయి.
అడాడియా పాక్ అనే గుజరాత్ సంప్రదాయ స్వీట్ రుచికి టేస్టీగా ఉంటుంది. మినుపపిండి, నెయ్యి, బెల్లంతో దీన్ని తయారు చేస్తారు. శారీరాన్ని వేడిగా ఉంచడంలో సాహాయపడుతుంది.
సొంత్ కె లడ్డును ఎండబెట్టిన అల్లం పౌడర్‌కు బెల్లం, గోధుమ పిండి, నెయ్యిలను కలిపి ఈ స్వీట్‌ను తయారు చేస్తారు. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో తోడ్పడుతుంది.
గోండ్ కె లడ్డును బాదం బంక, గోధుమ పిండి, నెయ్యి, షూగర్ల మిశ్రమంతో తయారు చేస్తారు. ఇది కూడా శరీరాన్ని చలికాలంలో కాపాడుతుంది.
పెసరుపప్పు హల్వా శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. పెసరుపప్పు, పాలు, నెయ్యి, చెక్కరతో తయారు చేస్తారు.
మల్పువా అనేది ప్యాన్ కేక్ లాంటి స్వీట్. పాలు, చక్కెర, గోధుమ, మినుపలాంటి పండితో తయారు చేస్తారు. బాడీని వేడిగా ఉంచుతుంది.
నువ్వుల లడ్డుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలోని బెల్లం, నువ్వులు రక్తహీనతను తగ్గించడంలో తోడ్పడుతాయి. ఈ లడ్డు బాడీని వేడిగా ఉంచుతుంది.