నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
నైట్ షిఫ్ట్స్‌లో పనిచేసే వారికి పగలు ఎక్కువగా నిద్రపట్టదు. రోజులో కనీసం ఏడుగంటలు నిద్రపోతేనే ఆరోగ్యంగా ఉంటారు.
ఆఫీస్‌కు వెళ్లేముందు రాగి జావ, జొన్న రొట్టె తింటే మంచిది.
షిఫ్ట్ పూర్తయిన తర్వాత నిద్రపోయే ముందు పాలు తాగడంతో పాటు అరటి తినడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
రాత్రిపూట ఎక్కువసేపు మేల్కోవాలని కాఫీ, టీలు తాగుతుంటారు. వీటివల్ల అజీర్తి, ఎసిడిటీ సమస్యలు వస్తాయి.
నైట్ షిఫ్ట్‌లో పనిచేసే వాళ్లకు విటమిన్ డి అంతగా అందదు. కాబట్టి రోజూ కొంత సమయం సన్‌లైట్‌లో ఉండాలి.
రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం చేయాలి.
జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచుతాయి.